24-09-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షేట్టిపేట, సెప్టెంబర్ 23: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నా రు.
ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్య ఇబ్బందిని నియమించి మందులను అందుబాటులో ఉంచి ప్రజల సంక్షేమం కొరకు తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్యాంటీన్, మార్చురీ గదుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని హెచ్చరించారు. అనంతరం కస్తూరిబా గాం ధీ బాలికల పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
ఆసుపత్రి పనులు పరిశీలన
మంచిర్యాల, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఐబీలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను మంగళ వారం సాయంత్రం కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన అర్హులైన బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.