calender_icon.png 27 August, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులు క్రీడల్లో రాణించాలి

27-08-2025 12:21:01 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 26(విజయ క్రాంతి): క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జాతీయస్థాయి నెట్ బాల్ క్రీడలకు ఎంపికైన విద్యార్థినిలను మంగళవారం సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లోనూ ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించా రు.

జాతీయస్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలువాలని సూచించారు.ఈనెల 28 నుండి 31 వరకు హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో శాలిని, నిహారిక పాల్గొంటారని నెట్ బాల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు అలీబిన్ అహ్మద్, తిరుపతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మార్సుకోల సరస్వతి , రవీందర్, హైమద్, రవి పాల్గొన్నారు.