15-05-2025 12:18:42 AM
న్యూఢిల్లీ, మే 14: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ గురించిన వివరాలను వీరు రాష్ట్రపతికి వివరించినట్టు రాష్ట్రపతి భవన్ ఎక్స్‌లో పేర్కొంది.