calender_icon.png 24 October, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి

23-10-2025 08:30:56 PM

టీం వర్క్ చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్

వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష

రాజన్న  సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ.. జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేలా పని చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. ఇంచార్జి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెసిడెన్షియల్, అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.