calender_icon.png 30 December, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు పక్కన టేకు చెట్లు నరికివేత

30-12-2025 12:21:55 AM

స్థానికంగా ఉండని బీట్ ఆఫీసర్

ఇష్ట్టారాజ్యంగా టేకు చెట్ల రవాణా?

జుక్కల్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లాలో గల జుక్కల్ మండలంలోని సావర్గం, పెద్ద కొడప్గల్ మండలంలోని లింగంపల్లి, విట్టల్వాడి గ్రామాలకు వెళ్లే మెయిన్ రోడ్డు కు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన టేకు చెట్లను ప్రజలు నరికి వేస్తున్నారని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. దీంతోపాటు గ్రామ శివారులోని టేకు చెట్లు వేప చెట్లు కూడా నరికివేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పేర్కొంటు న్నారు. జుక్కల్ రేంజ్ లోకి వచ్చే గ్రామ శివారులోని చెట్లు అన్ని అక్రమార్కుల చేతిలో మాయమవుతున్నాయని అంటున్నారు. కొందరు కట్టెల వ్యాపారులు ఇష్టారీతిన  రాత్రిపూట నరికివేసి ఎవరికీ తెలియకుండా తరలించకపోతున్నట్లు సమాచారం.

ఇంత అద్భుతంగా జరుగుతున్న స్థానికంగా ఉండాల్సిన లింగంపల్లి బీట్ ఆఫీసర్ అందుబాటులో ఉండడం లేదంటూ చెబుతున్నారు. ఈ తతంగం రాత్రి పూటనే కాకుండా మధ్యా హ్నం కూడా జరుగుతుందని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అడవి ప్రాంతంలో కట్టెలను నరికే కట్టెల వ్యాపారులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు అమ్యమ్యలకు ఆశ చూపడంతో అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విధంగా వ్యవహారం కొనసాగితే ఉన్న అటవీ ప్రాంతం మాయమవుతుందని వన్యం ప్రేమికులు సూచనప్రాయంగా పేర్కొన్నారు. సంబంధిత ఫారెస్ట్ జిల్లా అధికారులు ఈ విషయంపై దృష్టి సారిస్తే మరిన్ని ఆక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.