calender_icon.png 26 January, 2026 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

26-01-2026 12:32:08 AM

  1. కలెక్టర్ ప్రావీణ్య
  2. ఎమ్మెల్యే సంజీవరెడ్డి 

నారాయణఖేడ్, జనవరి 25 :మహిళా సంఘాల సభ్యులు వ్యాపార వేత్తలుగా ఎదిగి సమాజంలో ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కు, స్వయం ఉపాధికి బాట వేస్తూ మహిళా సంఘాల జాతర పేరిట నారాయణఖేడ్ డివిజన్ స్వ యం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన మరియు విక్రయ మేళాను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి ఆదివారం నారాయణఖేడ్ రైతు వేదికలో ప్రారంభించారు.

ఈ మేళా ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసినఉత్పత్తుల విక్రయ కేంద్రాలను పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల త యారీ విధానం, మార్కెటింగ్ వివరాలను మహిళలతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక ప్రగతిని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన నాణ్యమైన ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించి విక్రయించేలా ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల మహిళా సంఘాల ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారని, ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా సేర్ఫ్, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించి వారిని వివిధ వ్యాపారాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

మహిళలు ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు సాగు చేయడం, బోటిక్ నిర్వహణ, ఆహార ఉత్పత్తుల తయారీలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. అయితే మార్కెటింగ్, ప్యాకింగ్, లేబెలి్ంప మరింత దృష్టి సారించి బల్క్ మార్కెటింగ్ చేపడితే వారి ఆదాయం మరింత పెరుగుతుందని, అందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్డీఓ అడిషనల్ పీడీ సూర్యారావు, తహసిల్దార్, ఏపిఎంలు, డిపిఎంలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.