calender_icon.png 12 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి కరాటే పోటీల పోస్టర్ విడుదల

04-09-2025 12:57:39 AM

ఉప్పల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యం లో నెల్ల 29వ జాతీయ స్థాయి కరాటే పోటీల ను ఈనెల 14 న సెప్టెంబర్ నాడు బొమ్మకు బాలయ్య గార్డెన్ లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ లను తెలంగాణ స్టేట్ నారాయణ స్కూల్  జీఎం గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు అధ్యక్షులు కరాటే మల్లికార్జున గౌడ్, చైర్మన్ సదాశివుడును అభినందించారు. జాతీయ స్థాయి నుండి దాదాపుగా 12 రాష్ట్రాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ మాస్టర్లు శ్రీనివాస్, వెంకటేష్, ప్రసాద్ గౌడ్,  నారాయణ తదితరులు పాల్గొన్నారు.