02-05-2025 01:05:10 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జన గణనలో భాగంగా కుల గణన కూడా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్రంపై కులగణన కోసం పోరాటం చేసినందుకే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. కాగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశానుసారం మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో.. రాహుల్‌గాంధీ చిత్రపటంతోపాటు తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కులగణన అమలు చేసినందుకు ఇద్దరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఆలస్యంగానైనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రు లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఏడాదిన్నరలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాధిం చిన విజయమని సంతో షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.