14-10-2025 12:12:04 AM
మంథని, అక్టోబర్ 14 (విజయ క్రాంతి) మంథని మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు స్మారక బస్ షెల్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుట్టపాక గ్రామ ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం తన తండ్రి పేరు మీద బస్టాండ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రయాణికులు ఈ బస్టాండ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, పుట్టపాక మాజీ సర్పంచ్ అయిలి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.