calender_icon.png 30 December, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాది కోట్లాది కొలువులకు ఎసరు

30-12-2025 12:00:00 AM

ఏఐ పితామహుడు జెఫ్రీ హింటన్ హెచ్చరికలు

న్యూయార్క్, డిసెంబర్ ౨౯: కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా వచ్చే ఏడాది ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కొలువులు ఊడతాయని ఏఐ పితామహుడు తాజాగా జెఫ్రీ హింటన్ హెచ్చరికలు జారీ చేశారు. మానవ వనరుల స్థానంలో మున్ముందు బహుళ జాతి కంపెనీలన్నీ ఏఐ వినియోగించనున్నాయని, దీంతో ఒక్కో దేశంలో లక్షలాది ఉద్యోగాలకు ఎసరు వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాల్ సెంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కంటే ఏఐ మెరుగైన ఫలితాలు ఇస్తున్నదని వెల్లడించారు.

అత్యంత సంక్లిష్టమైన పనులను సైతం ఏఐ చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో కంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని తెలిపారు. కోడింగ్ రాయడంలో ఏఐ అసమానమైన ప్రతిభ కనబరుస్తోందని, మనుషులు నెలల తరబడి చేసే పనిని ఏఐ ఒక్కరోజులోనే చేస్తోందని వివరించారు. ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉపాధికి పెద్ద సవాల్‌గా మారందని వ్యాఖ్యానించారు.