calender_icon.png 23 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వాలీడేషన్ చట్టాన్ని ఉప సహరించుకోవాలి

23-12-2025 12:12:35 AM

హనుమకొండ టౌన్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా శాఖ నూతన మీటింగ్ హాల్ ప్రారంభోత్సవం, 2026 డైరీ ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు ఈ. నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ జాతీయ చైర్మన్ ఆర్. ఎస్. శర్మ, సెక్రటరీ జనరల్ డి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు ఏ. రాజేంద్ర బాబు లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2025లో పార్లమెంట్లో ఆ మోదింప చేసుకున్న పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ చ ట్టం ద్వారా 1982లో వై.వి చంద్రచుడు అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మస నం డి.ఎస్ నకార వేసిన కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్నీ కూడా జనవరి 2026 నుండి ఈ చట్టం ప్రకారం వర్తించవు అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోవడం ద్వారా దుర్మార్గమని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ చట్టం అమనైనట్లయితే 31 డిసెంబర్ 2025 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్తులో పెన్షన్ దారులకు పిఆర్సి, డిఏలు వర్తించవని అ న్నారు. మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయంగా రావలసిన రిటైర్మెంట్ బకాయిలు జిపిఎఫ్, జిఐఎస్ గ్రాట్యూటీ, కమ్యూ నికేషన్ లీవ్, ఎనకల్స్మెంట్ లీవులు, సరెండర్ లీవులు, పిఆర్సి 2020 డిఏ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బకాయిలు అందక అప్పుల బాధతో బ్యాంకు రుణాలు చెల్లించలేక మానసిక వేదతో కృంగిపోయి, అనారోగ్యంతో దాదాపు 35 మంది పెన్షనర్లు చనిపోవడం బాధాకరమైన విషయమని, వారిపై దయతలిచి వెంటనే రిటైర్మెంట్ బకాయిలన్నింటిని చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి పి ఏ టి ప్రధాన కార్యదర్శిలు ఎం.పీ నర్సింగరావు, సత్యదేవ్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు జి. వీరస్వామి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎ ల్. ప్రకాష్, చీఫ్ అడ్వైజర్ రత్నాకర్, కోశాధికారి సూర్యప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్. ప్రభాకర్ రెడ్డి, కే. దేవదాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.