calender_icon.png 24 December, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

24-12-2025 12:50:59 AM

సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.