17-09-2025 01:25:24 AM
అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి యాదగిరి
నారాయణపేట.సెప్టెంబర్,16(విజయక్రాంతి) : అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైనంత యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కు వినతి పత్ర అందచేశారు .
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో ముందస్తు వర్షాలకు రైతులు అధిక మొత్తంలో పంటలు సాగు చేయడం జరిగింది సకాలంలో యూరియా వేస్తేనే పంటలు ఏపుగా పెరిగి సరిపడినంత దిగుమతి వస్తుందని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిత్తశుద్ధితో డిమాండుకు తగ్గ యూరియాను సరపర చేయాలన్నారు.
దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందన్నారు తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా కేవలం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసిందన్నారు మిగతా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగానికి యూరియా అంధక తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారన్నారు.
వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కోఆపరేటివ్ సొసైటీల చుట్టూ, యూరియా కేంద్రాల చుట్టూ రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారనీ ,అన్నం పెట్టే అన్నదాతను అష్టా కష్టాల పాలు చేస్తుందన్నారు. రైతాంగ డిమాండ్ అనుకూలంగా కొరత లేకుండా యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, కొండ నరసింహులు, సహాయ కార్యదర్శి బి నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రాములు, కనకప్ప, బసప్ప తదితరులుపాల్గొన్నారు