calender_icon.png 28 September, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోలో ప్రయాణించిన మంత్రి శ్రీధర్‌బాబు

28-09-2025 12:45:43 AM

-ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రయాణం

-ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి

-నగరాభివృద్ధికి మెట్రో రైలు విస్తరణ మరింత అవసరమని వ్యాఖ్యలు

ఎల్బీనగర్, సెప్టెంబర్ 27: ఎల్బీనగర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని శనివారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.   అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మెట్రో రైల్‌లో ప్రయాణం చేశారు. నగరంలో వర్షా ల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో హైటెక్ సిటీలోని మరొక ముఖ్య కార్యక్రమానికి ఆలస్యమవుతుందనే సందర్భంలో ఉప్పల్‌లో మెట్రో రైల్ ఎక్కి హైటెక్ సిటీ వరకు ప్రయాణం చేశారు.

ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి సమ స్యలు తెలుసుకున్నారు. నగరాభివృద్ధికి మెట్రో రైలు విస్తరణ మరింత అవసరమని, ప్రభుత్వం ఈ దిశగా కట్టుబడి ఉందని మంత్రి  పేర్కొన్నారు.మంత్రి వెంట ఆర్డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి కూడా ఉన్నారు.   కాగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు.  మంత్రి   మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌర వానికి ప్రతీకగా, తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల హృదయాల్లో  చిరస్మరణీయులని  అన్నారు.