31-01-2026 12:00:03 AM
పట్టించుకోని అధికారులు
బూర్గంపాడు, జనవరి30 (విజయక్రాంతి): మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద మిషన్ భగీరథ మంచినీరు పైపు లీకేజీ అయి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ ఏఈ, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం పై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.
గత కొన్ని రోజుల నుండి నీరు వృథాగా పోతున్న పట్టించుకోకపోవడంపై ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.మిషన్ భగీరథ అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు తెలిపిన స్పందించడం లేదని వాపోయారు. ఓ వైపు గ్రామాల్లో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలా నీటిని వృథా చేయడమేంటని ప్రశ్నస్తున్నారు.మిషన్ భగీరథ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.