calender_icon.png 10 May, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడ్డ కార్యకర్తలను పార్టీ గుర్తించాలి

08-05-2025 12:08:26 AM

  1. చేవెళ్ల మీటింగ్‌లో కార్యకర్తల డిమాండ్ 

ఎమ్మెల్యే పగలు కాంగ్రెస్.. రాత్రి బీఆర్‌ఎస్ అని ఆరోపణ 

కార్యకర్తలను కాపాడుకుంటాం  

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి 

చేవెళ్ల, మే 5: కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కష్టపడ్డ వారిని గుర్తించాలని చేవెళ్ల నియోజకవర్గ కార్యకర్తలు డి మాండ్ చేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య పగలు కాంగ్రెస్ తరపున, రాత్రి బీఆర్‌ఎస్ తరపున పనిచేస్తున్నారని, ఆయన తీరును హైకమాండ్ గమనించాలని కోరారు.

బుధవారం చే వెళ్ల మున్సిపాలిటీలోని అట్లాస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీంభరత్ అధ్యక్షతన ‘జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి తెలంగా ణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, కార్యక్రమ కోఆర్డినేటర్ గుప్త అమిత్ రెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్ దారాసింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు

సమావేశంలో కార్యకర్తలు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుం చి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పదవులు కట్టబెడుతూ కాంగ్రెస్ కార్యకర్తల ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు నచ్చని పనులు చేసిన కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని, దీనివల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీరును హైకమాండ్కు తెలియజేయాలని కోరారు.

కార్యకర్తలను సమన్వయం చేసుకుంటాం: శివసేనారెడ్డి

తెలంగాణ స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీని బలోపే తం చేయడమే లక్ష్యమని, అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2017 నుంచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే పదవులు ఇస్తామని , గ్రామస్థాయి నుంచి మండల స్థా యి వరకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

నవాబ్పేట్ మండలంలో పోలీసులు కార్యకర్తలను ఇబ్బంది పెడితే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ‘జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్’ ఇన్చార్జ్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంలో దాని విలువలు, సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసుధన్ రెడ్డి,

రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరిసతీష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు దేవరి వెంకటరెడ్డి, ఆగిరెడ్డి, మండలాల అధ్యక్షులు మానయ్య, జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు సురేందర్ రెడ్డి, పెంటయ్య గౌడ్, నేతలు పెంటారెడ్డి, టేకుల పల్లి శ్రీనివాస్, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసుధన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరిసతీష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు దేవరి వెంకటరెడ్డి, ఆగిరెడ్డి, మండలాల అధ్యక్షులు మానయ్య, జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు సురేందర్ రెడ్డి, పెంటయ్య గౌడ్, నేతలు పెంటారెడ్డి, టేకుల పల్లి శ్రీనివాస్, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.