27-09-2025 01:21:49 AM
రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన జిమ్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.