19-08-2025 01:35:58 AM
కాగజ్‌నగర్, ఆగస్టు (విజయక్రాంతి): ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్.49 రద్దు... పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం ముట్టడి పిలుపుమేరకు భాజపా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
సోమవారం ఉదయం కాగజ్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో డాక్టర్ పాల్వా యి హరీష్ బాబును గృహనిర్బంధం చేశా రు. కాగజ్‌నగర్ రూరల్ సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజ పా నాయకులను అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతియుతంగా పోడు రైతులు సమస్య కోసం ఆందోళన నిర్వహించేందుకు యత్నిస్తుండగా, పోలీసులు అరెస్టు చేయడం అన్యాయ మన్నారు. పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మక్కై భాజపా నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమం జసమన్నారు. పోటు రైతుల సమస్య పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి పిలుపు పై పిలునిచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులను అరెస్టు చేసిన కగజ్ నగర్ పట్టణ పోలీస్ అక్రమంగా అరెస్టు చేసి కేరమెరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గం లోని పోడు భూములు సాగు చేసే రైతులకు పోడు పట్టాలు ఇవ్వమని ప్రశ్నించే గొం తును ప్రజలకు మద్దతు చేసే నాయకులను అక్రమంగా ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి కెరమెరి తరలిస్తున్న పోలీసులు అరెస్టైన వారిలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు దోని శ్రీశైలం, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యక్రమ కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం, బిజెపి సీనియర్ నాయకులు బిజెపి సీనియర్ నాయకులు సిందం శ్రీనివాస్,జిల్లా అధికార ప్రతినిధి సమీర్ గుప్తా జిల్లా కౌన్సిల్ సభ్యులు వికాస్ గారామి పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్ లను పోలీస్ వ్యాన్‌లో కేరమేరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.