20-08-2025 11:17:19 PM
-ఇందిరాపార్కు వద్ద ధర్నా
-హాజరైన తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత ప్రభుత్వం మల్టీ జోన్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత మల్టీజోన్ -1 19 జిల్లాలతో, మరో 19 జిల్లాలతో మల్టీజోన్ -2ను ఏర్పాటు చేసి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను మల్టీజోన్ స్థాయికి మార్చినట్లు గెజిటెడ్ హెచ్ ఎంల ప్రతినిధులు దామోదర్ రెడ్డి, అచ్యుత రెడ్డి, కృష్ణ చారి, విష్ణు వర్ధన్ రెడ్డి పి.వి.ఎల్ ఎన్ మూర్తి రత్నాకర్ రెడ్డిలు పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఇందిరాపార్కు దర్నా చౌక్‌లో మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గెజిటెడ్ ప్రధానోపాద్యాయుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2015 తరువాత వివిధ కారణాలతో ఆగిపోయిన పదోన్నతులను ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత సెప్టెంబర్ 23 లో షెడ్యూల్ ప్రకటించి దాదాపు రెండు వేల మంది ఉపాధ్యాయులకు మల్టీ జోన్1, 2 లలో గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పోస్టింగ్ లు కల్పించినట్లు తెలిపారు.
ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 720 మంది కామారెడ్డి మెదక్ ఆదిలాబాద్, కొమురంభీం ఆసీఫా బాద్, నిర్మల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాలకు బదిలీలు కావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 902 ప్రధానోపాధ్యాయ పోస్టులను బదిలీలతో భర్తీ చేసిన తరువాతనే మిగతా వారికి ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వేణు గోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, టిఎనా్హ్యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్ తో పాటు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.