calender_icon.png 2 July, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవా

01-07-2025 06:15:25 PM

మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత వైద్యులది..

డాక్టర్స్ డే వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్..

రామగుండం (విజయక్రాంతి): వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవా మార్గమని, మానవత్వాన్ని కాపాడే గొప్ప వృత్తి, బాధ్యత వైద్య వృత్తి అని మంగళవారం డాక్టర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్(MLA Makkan Singh Raj Thakur) అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం డాక్టర్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి డాక్టర్లకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌ల డాక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలను గౌరవిస్తూ ప్రతి ఒక్క డాక్టర్‌ను శాలువాతో సత్కరించి గిఫ్టులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, వైద్య శాఖ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. డాక్టర్లు ఈ సన్మానాన్ని గుర్తుగా భావిస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.