23-08-2025 12:28:09 AM
కోదాడ: నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవఖానాలో రూ.3.14 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రూ.26 కోట్లతో వంద పడకల దవఖానను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
విస్తరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెడ్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి,వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహ, నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, కందుల కోటేశ్వరరావు, కమదన చందర్ రావు, మధు, ఈదుల కృష్ణయ్య, బాగ్దాద్, భాజాన్ ముస్తఫా పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు రూ.21 కోట్ల నిధులను కేటాయించారు.
అభివృద్ధి పనుల్లో భాగంగారోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చిలుకూరులో సీఆర్ఆర్ నిధులు రూ 1.08 కోట్లతో చిలుకూరు నుండి జానకి నగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. నడిగూడెం మండలం, నారాయణ పురం లో సీఆర్ఆర్ నిధులు రూ3.20 కోట్లతో నారాయణ పురం నుండి కాగిత రామచంద్రాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పద్మావతి శంకకుస్థాపన చేశారు. అదేవిధంగా సీఆర్ఆర్ నిధులు రూ 2కోట్లతో కేశవా పురం నుండి వల్లాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.