23-08-2025 12:27:50 AM
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, ఆగస్టు 22 (విజయక్రాంతి): పదవీ విరమణ పొందే ఉద్యోగులు పెన్షన్, జిపిఎఫ్ చెల్లింపు పత్రాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా డీడీవోలు అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి సమర్పించాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి లో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, జిపిఎఫ్ సమస్యలపై డిడివోలు, ఖజానా శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పెన్షన్, జిపిఎఫ్ పై ఏజీ, ఖజానా శాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ సమావేశంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హైదరాబాద్ ఏజీ కార్యాలయ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ కుమార్ సోనర్కర్, నరేష్ కుమార్ ల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల అంగన్‌వాడీల తనిఖీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే విద్యా ప్రమాణాలు బాగుండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులకు సూచించారు. హసన్ పర్తి మండలం వంగపహాడ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పలు తరగతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏడు, పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి గదిలో సాంఘిక శాస్త్రంలోని జాతియోధ్యమ పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తుండగా పాఠ్యాంశంలో ఉన్నట్లుగా దేశ పటాన్ని చూపిస్తూ ఆనాటి ప్రాంతాలను విద్యార్థులు గుర్తించాలని కలెక్టర్ సూచించగా విద్యార్థులు గుర్తించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, తహసీల్దార్ ప్రసాద్, ఎంఈఓ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.