calender_icon.png 2 October, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం

02-10-2025 12:44:09 AM

  1. దసరా వేడుకకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం 

ముఖ్య అతిధిగా హజరుకానున్న మంత్రి పొంగులేటి 

ఇల్లెందు, అక్టోబర్ 1,(విజయక్రాంతి):దసరా పండగ సందర్భంగా ప్రతి ఏటా ఇల్లందు మున్సిపాలటి పరిధిలోని సింగరేణి పాఠశాల స్ధలంలో నిర్వహించే జమ్మి వేడుకకు ముఖ్య అతిధిగా రెవిన్యూ, గ్రృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హజరవుతున్న సందర్భంగా ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీలించారు. ఆయన దసరా వేడుక ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రఖ్యాతి గాంచిన జమ్మి వేడుకకు సుదూర ప్రాంతాల నుండి హజరయ్యే ప్రజానికానికి ఇబ్బందులు కలుగకుండా చుడాలని మున్సిపాలటి అధికారులను ఆదేశించారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు, మున్సిపాలిటి అధికారులు టౌన్,

మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్, పులి సైదులు, టౌన్ ఉఫాధ్యక్షుడు సుదర్శన్ కోరి, టౌన్ కార్యదర్శి జాఫర్, నాయకులు మాడుగుల సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీను, గందె సదానందం, తాటి బిక్షం, చెన్నూరి శ్రీను, చెన్నూరి క్రిష్ణ, దండుగుల శీవ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.