02-10-2025 12:49:05 AM
సూర్యాపేట, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : రావణాసురుని కంటే భయంకరమైనది సింగిల్ యూస్ ప్లాస్టిక్ భూతమని గ్రీన్ క్లబ్ ట్రస్టు అధ్యక్షులు ముప్పారపు నరేందర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జమ్మి గడ్డలో గల రైస్ మిల్లర్స్ బిల్డింగ్ అసోసియేషన్ వద్ద 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని మున్సిపాలిటీ సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు దేశంలోని మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో ప్లాస్టిక్ నివారణపై గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రజల్లో అవగాహన కనిపించుటకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల తో భూతాన్ని తయారుచేసి విజయదశమి సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు విజయదశమి నుండి ప్లాస్టిక్ ను తరిమివేస్తామంటూ ప్రతిజ్ఞ చేసి క్లాత్ సంచులు వాడాలన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ను మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోట కిరణ్ సహాయ కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు ముప్పారపు నాగేశ్వరరావు, తల్లాడ రామచంద్రయ్య తొణుకునూరు మురళీమోహన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎండి గౌసుద్దీన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.