02-09-2025 12:25:26 AM
- సిరిసిల్ల జిల్లా కలెక్టరెట్ ముందు నల్ల చొక్కా,
- నల్ల బ్యాడ్జిలతో ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నిరసన
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) టిజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు మారం జగదీష్, ఏలూరి శ్రీనివాస రావు. పిలుపు మేరకు సెప్టెంబర్ ఓకటి. జిల్లాలలొ కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్న తరుణంలొ, మన సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఉద్యోగులందరు ఉదయం పది గంటలకు. నిరసన చేపట్టడం జరిగింది, జిల్లాలోని వివిధ సంఘాలు టిజిఓ & టి ఎన్ జి ఓ , ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్స్, కార్మిక సంఘాల తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జేఏసీ చైర్మన్ ఎలుసానీ ప్రవీణ్ కుమార్, కన్వీనర్ సమర సేన్, కార్యదర్శులు సయ్యద్ జబి, గాజుల సుదర్శనం. మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలొ పొందు పరిచిన అంశం సిపిఎస్. ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపిఎస్. ను అమలు చేస్తామని చెప్పిన హామీ ను అమలు చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది, ఇప్పటి వరకు పిసిఆర్. అమలు కాలేదని, డి. ఎ, పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయని విటన్నిటిపై దశల వారీగా ఉద్యమాలు చేయడానికి రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని, సెప్టెంబర్.
ఒకటి.నుండి పెన్షన్ విద్రోహ దినంగా ప్రారంభమవుతున్న నిరసన కార్యక్రమానికి సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయానికి అనేక సంఘాల నుండి నల్ల చొక్కా లతో తరలి వచ్చారని, అదే విధంగా హైదరాబాద్ లొ ఈరోజు సాయంత్రం భారీ ఎత్తున నిర్వహిస్తున్న హైదరాబాద్ సభకు జిల్లా నుండి నాయకులు పాల్గొనడానికి వెళుతున్నట్లు తెలిపారు, సిరిసిల్ల లొ ఈనాటి పెన్షన్ విద్రోహ దినం నిరసన కార్యక్రమానికి పాల్గొన్న నాయకులలో TNGO అసోసియేట్ ప్రెసిడెంట్ మెట్ట శ్రీకాంత్, కోశాధికారి ఎం.డి రియాజ్ పాషా, టీ. జీ. ఒ అసోసియేటెడ్ ప్రెసిడెంట్ జోగం రాజు,కోశాధికారి అహ్మద్ రసూల్, జాయింట్ సెక్రటరీ B. శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ. B. సాగర్, మహిళ ఉపాధ్యక్షురాలు జానకి, ట్రెసా అధ్యక్షులు జయంత్ కుమార్, ఎ. ఇ. ఇ అధ్యక్షులు ఎం. వెంకట్ రెడ్డి ఎ. ఇ. వో అధ్యక్షులు లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులు అనిల్, ఎ. ఎస్. వో అధ్యక్షులు సుమన్, నాలుగో తరగతి జిల్లా అధ్యక్షులు జీవన్, దేవాదాయ శాఖ ఫోరమ్ అధ్యక్షులు ఎడ్ల శివకుమార్, సభ్యులు అధ్యాపకులు. R. శేఖర్, గోపి,జయభారత్ రెడ్డి తదితర శాఖల అధికారులు అధిక సంఖ్యలొ పాల్గొన్నారు.