calender_icon.png 2 September, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

02-09-2025 12:26:46 AM

- ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్, సెప్టెంబరు 1 (విజయ క్రాంతి): పెన్షన్ భిక్ష కాదు పెన్షన్ ఉద్యోగుల హక్కు అని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మ న్ దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగా ణ రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ ఇచ్చిన పిలు పు మేరకు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్ష నర్లందరూ పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల టి షర్ట్లు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 3035 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదని, ఒక సాంఘిక భద్రత చర్య అని, దీనిని భారత అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టంగా గుర్తించిందని పేర్కొన్నారు. ఆ తీర్పును ప్రభుత్వాలు గౌరవించాల్సిన బాధ్యత తప్పకుండా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్, టిఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, వేల దాసరి లింగయ్య, టీచర్ల సంఘం నాయకులు రఘు శంకర్ రెడ్డి, రవీంద్ర చారి, కరుణాకర్ రెడ్డి, నాయకులు నాగుల నరసింహ స్వామీ, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, ఇరుమల్ల శారద, సబితా, రవీందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రాజేష్ భరద్వాజ్, తదితరులుపాల్గొన్నారు.