calender_icon.png 9 August, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి

08-08-2025 01:10:24 AM

- ప్రాజెక్టుపై అభ్యంతరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశా..

- బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

ముషీరాబాద్, ఆ గస్టు 7(విజయక్రాం తి): బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని, ఏట్టి పరిస్థితు ల్లో రాజీపడమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విపత్తుల నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు, రాష్ర్ట పర్యావరణశాఖ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు.

ఈ ప్రాజెక్టుపై ఆంధ్రలోని కొందరు పర్యావరణ వేత్తలు, మేధావులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి లేఖ రాసానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్ట్‌కు 90 లక్షల ఎకరాల సాగు భూమికి తీసుకొని, 8 లక్షల ఎకరాలకే సాగునీరు ఇ స్తున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్ ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి రూ. 81,900 కోట్లు ఖర్చుఅవుతుందని అన్నారు.