14-10-2025 01:14:52 AM
మహబూబాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖ అధికారులతో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు, నిధులు మంజూరు చేసిన పనుల అభివృద్ధి, ఎస్సారెస్పీ కాలువల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
డిబిఎం 48 ప్రధాన కాలువతో పాటు ఉపకాల్వలో పూడిక తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ అధికారులు రామకృష్ణ, వీరస్వామి, అప్పయ్య, శ్రావణి పాల్గొన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. లో ఓల్టేజి సమస్యతోపాటు ఇతర అంశాలను సమీక్షించారు.