calender_icon.png 22 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

22-11-2025 01:37:13 AM

గ్రామాల్లో లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలి ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి 

నారాయణఖేడ్, నవంబర్ 21: నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని నారాయణఖెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో ప్రత్యేక సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ అధికారులు బాధ్యతగా వ్యవహ రించాలని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో, తాండాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో ఆయా గ్రామాల్లో సమస్యలు అధికంగా వస్తున్నాయని అధికారులకు వివరించారు. సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని అవసరమైన గ్రామాల్లో అదనపు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అదనపు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సూచించారు. విద్యుత్ లైన్ మెన్లు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్ , ఏడి నాగిరెడ్డి, ఏఈలు నారాయణ, మోతీరం, శోభారాణి, సుప్రజ, నియోజకవర్గంలోని లైన్మెన్లు పాల్గొన్నారు.