23-10-2025 08:25:31 PM
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కు కోసం కేటాయించాలని కమిషనర్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాన గళ్ళ యాదగిరి కోరారు. గురువారం మున్సిపల్ కమిషనర్ శైలజను పలువురు డివిజన్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ... 13వ డివిజన్ పరిధిలో ఉన్న దేవేందర్ నగర్ 1 దేవేందర్ నగర్2, గౌతమ్ నగర్, అంబేద్కర్ నగర్ తదితర కాలనీలలో ఎటువంటి పార్కు సదుపాయం లేదని, ఈ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తే అనేక కాలనీలకు సదుపాయం కలగడంతో పాటు కబ్జాకు గురికాకుండా కాపాడవచ్చు అని తెలిపారు.
ఈ అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని కమిషనర్ శైలజ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు అన్నారు.ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ అధ్యక్షులు చిప్పల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి తుక్కోజి అమరేందర్, గౌరవ అధ్యక్షులు అన్నం దాసు బిక్షపతి, సంతోష్ కుమార్, సలహాదారులు కుమారస్వామి రాజగోపాల్ నాయుడు,సతీష్ కుమార్, నాగేంద్ర చౌదరి, మహిళలు నాయకులు ఎదుల రేణుక,పల్లె మంగమ్మ, కోకిల రాణి, తుక్కోజీ మమత, తదితరులు పాల్గొన్నారు.