calender_icon.png 13 May, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో.. రామ..

12-05-2025 12:35:35 AM

  1. భద్రాద్రిలో ఎండలకు అవస్థలు పడుతున్న  భక్తులు
  2. అన్న సత్రం, కల్యాణ మండపం వైపు వెళ్లే కాలిబాటకు కార్పెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న భక్తులు

భద్రాచలం, మే 11 (విజయ క్రాంతి) రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు కళాశాలలకు సెలవులు కావడం, దానికి తోడు ఉద్యోగస్తులకు శని, ఆదివారాలు సెలవులు రావడం తో  భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారిని దర్శించుకో వటానికి అధిక సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటున్నారు. ఉద యం 8 గంటల వరకు ప్రశాంతంగానే దైవదర్శనం చేసుకుని వారి వారి గమ్యస్థానాలక వెళుతుండగా 9 గంటల తర్వాత సూరన్న సుర్రు మంటుంటే తట్టుకోలేక భక్తులు విలవిలలాడుతున్నారు.

ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి కార్ల మీద వచ్చిన భక్తులు, అన్నదానానికి  వెళ్లే భక్తులు ఈ రోడ్డు మీద నుండే నడవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేవాలయం  పక్కన గల కళ్యాణ మండపం అన్నదాన సత్రం వెళ్లే రహదారి సిమెంట్ రోడ్డు వేసినందున ఆ రోడ్డుపై 10 గంటల తర్వాత నడవాలంటే ఇబ్బందికర పరిస్థితులను భక్తులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది.

సిమెంట్ రోడ్డుపై నడిచే భక్తులు కాళ్లు కాలడంతో ఉరుకుల పరుపులు తీస్తున్నారు. ఇక వయసు మళ్ళిన వారి పరిస్థితి, చిన్నారుల పరిస్థితి వర్ణనాతీతం. రామాలయం అధికారులు వెంటనే స్పందించి కళ్యాణ మండపం మీదుగా అన్నదానంకు వెళ్లే రోడ్డుపై కార్పెట్ వేసి ఆదుకోవాల్సిందిగా భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.