calender_icon.png 30 October, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

30-10-2025 12:00:00 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్      

కాంగ్రెస్‌కు మద్దతుగా లింగ్విస్టిక్ మైనార్టీల సమావేశం  

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే లింగ్విస్టిక్ మైనార్టీల మద్దతు ప్రకటించారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. టీపీసీసీ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ అధ్య క్షుడు రాజేష్‌కుమార్ అధ్యక్షతన బుధవారం నగరంలోని ఒక ప్రయివేట్ హోటల్‌లో నిర్వహించిన సమావేశానికి పీసీసీ చీఫ్‌తో పాటు మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పాటుపడుతుందని, అదే తరహా లో అభివృద్ది, సంక్షేమం చేపడుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రతి సమాజం, ప్రతి వర్గం అభివృద్ది దిశగా ముం దుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజేష్‌కుమార్ కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్రభుత్వం సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.