calender_icon.png 23 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తు సమయాన ‘మాక్‌డ్రిల్’

23-12-2025 12:31:44 AM

  1. పునరావాసకేంద్రాల్లో బాధితులకు వైద్యసహాయంపై అవగాహన 
  2. వైద్యసిబ్బందికి డీఎంహెచ్‌వో సూచనలు

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆదేశాల మేరకు సోమవారం రాంలీల ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మాక్‌డ్రిల్ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం విజయవంతం అయిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు అన్నారు. ఈ సందర్భం గా వరదలు, ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు పునరావాసకేంద్రాలకు తరలించిన వారికి సత్వరంగా అందించాల్సిన వైద్యసహాయంపైన డెమో నిర్వహించారు.

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుమాదవ్ ఆధ్వర్యం లో యుపిహెచ్‌సి వేంకటేశ్వరానగర్, శ్రీనివాసనగర్ సిబ్బందితో పాటు ఎంవి పాలెం సిబ్బందితో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. వాటి ద్వారా బాధితులకు, రోగు లకు చికిత్సలు చేశారు. ఈ శిబిరాన్ని సందర్శించిన డిఎంహెచ్‌ఓ రామారావు, డిప్యుటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుమాదవ్, వైధ్యాధికారులు ఇతర సిబ్బందితో మాట్లాడారు. 104 వాహనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

డిప్యుటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుమాదవ్ శిబిరం మొదలైన సమయం నుంచి ముగిసేంతవరకు పర్యవేక్షించారు. ఈ శిబిరంలో వెంకటే శ్వరానగర్ వైద్యాధికారి డాక్టర్ దేవిశ్రీ, ఎం వెంకటాయ్యపాలెం వైద్యాధికారి డాక్టర్ మహీధర్‌రెడ్డి, శ్రీనివాసనగర్ వైద్యాధికారి సమీరా, బస్తిడావాఖాన వైద్యధికారి అమీనా నాజ్, సూపర్ వైజర్లు వెంకటరెడ్డి, భద్రు, సాయికృష్ణ, జడ్ ఎస్ జయపాల్, సి హెచ్ రజినీ, భారతి, మాణిక్యం, శిరీష,  శారదా, సంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.