calender_icon.png 23 December, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి శివకామేశ్వరి చేయూత

23-12-2025 12:32:26 AM

అశ్వాపురం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పో యిన నిరుపేద కుటుంబానికి అండగా మేమున్నామంటూ శివకామేశ్వరి గ్రూప్స్ భరోసా కల్పించింది. మండల పరిధిలోని చి ంతిర్యాల కాలనీ గ్రామానికి చెందిన దామెర్ల రాజా ఇల్లు ఇటీవల ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలి నిరాశ్రయులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్టు మరియు శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు వెంటనే స్పందించారు.

మానవతా దృక్పథంతో సో మవారం బాధిత కుటుంబాన్ని పరామర్శిం చి, వారికి తక్షణ సాయంగా బట్టలు, వంట పాత్రలు (గిన్నెలు), బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆపద సమయంలో తమను ఆదుకున్నందుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోర్సా అలివేలు, ఉపసర్పంచ్ వెన్నా అశోక్ కుమార్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షరీఫుద్దీన్ , కోర్లకుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.