calender_icon.png 22 May, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి జిల్లాలో మాక్ డ్రిల్

08-05-2025 12:04:41 AM

యాదాద్రి భువనగిరి మే 7 ( విజయ క్రాంతి) : పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో, పాకిస్తాన్ నుండి ఎదురయ్యే ప్రతి దాడులను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఆపరేషన్ అభ్యాస పేరుతో భద్రతా బలగాలుచేపట్టిన డిఫెన్స్ మాక్ డ్రిల్ చేపట్టింది.

కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు సైరాన్ల మోత మోగింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వివరించాలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు సమర్థవంతమైన పౌర సంసిద్ధతే లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్స్ అని పోలీసులు పేర్కొన్నారు