10-01-2026 01:48:03 AM
వాషింగ్టన్: భారత్ -అమెరికా మధ్య జరగాల్సిన కీలక వాణిజ్య ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేయకపోవడం వల్లనే నిలిచిపోయాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఆరోపణలు చేశారు.
మోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కాల్ చేయాల్సి ఉందని, కానీ.. భారత ప్రధాని మోదీ పని చేయలేదని పేర్కొన్నారు. తమ దేశం విధించిన గడువు లోపు భారత ప్రధాని స్పందించకపోవడం వల్లే వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు రేసులో ముందుకు వెళ్లాయని పేర్కొన్నారు. భారత ఉత్పత్తులపై గతేడాది తమ దేశం 50 శాతం సుంకం విధించడానికి ఈ ఫోన్ కాల్ వ్యవహారమే ప్రధాన కారణమని తేల్చిచెప్పారు.