05-09-2025 12:44:49 AM
నిర్మల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): దేశంలో పేద ప్రజల అభ్యున్నతి కోసమే మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణం పరిగణం తీసుకొని కేంద్ర క్యాబినెట్ జీఎస్టీ పై 12 శాతం ఉన్న పనులను ఐదు శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. పన్నుల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు. సెప్టెంబర్ 15 నుంచి జీఎస్టీ కొత్త విధానం అమలవుతుందని దీని దేశ ప్రజలు అర్ధిస్తున్నారని పేర్కొన్నారు.