08-01-2026 12:44:23 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, జనవరి 7: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి భారత్ వా ణిజ్య విధానాలపై, ప్రధాని మోదీ తో తన సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు ఎంతో సన్నిహిత మైత్రి ఉందని చెబుతూనే, ప్రస్తుతం ఆయన తనపై అసంతృప్తిగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు ను కొనుగోలు చేయడం, భారతీయ వస్తువులపై అమెరికా భారీగా సుంకాలు (టారిఫ్స్) విధించడమే ఇందుకు కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. మోదీ చాలా మంచి వ్యక్తి. తనకు, మోదీకి మధ్య వ్యక్తిగత స్నేహం బలంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే రష్యాతో చమురు వ్యాపారం కొనసాగించడంపై తాను తీవ్ర అసహనంతో ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.