30-10-2025 12:00:00 AM
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రణవ్ తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ‘హృదయం’ చిత్రం తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డియాస్ ఇరాయ్’. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
‘భూత కాలం’, మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళ, తమిళంలో అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ సినిమా మలయాళ వెర్షన్‌ను తెలుగు రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
సుస్మి తా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ తొలి వారంలో తెలుగులోకి రానుంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి క్రిస్టో జేవి యర్ సంగీతం అందించారు.