calender_icon.png 31 January, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనాథ్, నితిన్ మీనన్‌లకు చోటు

31-01-2026 01:03:58 AM

దుబాయ్, జనవరి 30: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ  మెగా టోర్నీలో లీగ్ దశ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు 30 మందిని ఎంపిక చేయగా వీరిలో ఇద్దరు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. అంపైర్గా నితిన్ మీనన్ , రిఫరీగా జవగళ్ శ్రీనాథ్లు ఎంపికయ్యారు. త్వరలోనే సూపర్ 8, నాకౌట్ మ్యాచ్లకు అధికారుల పేర్లను వెల్లడిస్తామని ఐసీసీ తెలిపింది.

24 మంది ఆన్ఫీల్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. ఆరుగురు మ్యాచ్ రిఫరీలుగా సేవలందించనున్నారు.బంగ్లాదేశ్కు చెందిన షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్కు కూడా చోటు దక్కింది. భద్రతా కారణాలతో భారత్లో ఆడలేమని వరల్డ్కప్ను బాయ్కాట్ చేసిన ఆ దేశానికి బుద్ది చెబుతూ ఐసీసీ షర్ఫుద్దౌలాకు అంపైరింగ్ చేసే అవకాశమిచ్చింది . ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగే ఆరంభ మ్యాచ్కు కుమార ధర్మసేన అంపైరింగ్ చేయనున్నారు. ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్కు ధర్మసేనతో పాటు ఇల్లింగ్వర్త్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.