calender_icon.png 7 May, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి పనితీరు భేష్

07-05-2025 12:00:00 AM

బీహార్ గ్రూప్-1 అధికారుల బృందం కితాబు

హైదరాబాద్, మే 06 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నిర్వ హిస్తున్న ‘సీఎం ప్రజావాణి’ పనితీరు బాగుందని బీహార్ గ్రూప్-1 అధికారుల బృందం కితాబిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని బీహార్ అధికారులు సందర్శించారు. ప్రజావాణి అమలు జరుగుతున్న తీరుతె న్నులను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారుల బృందానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ ప్రజావాణి పనితీరును వివరించారు. ప్రజావాణి నిర్వహిస్తోన్న తీరు చాలా బాగుందని అధికారులు పేర్కొన్నారు.

తమ రాష్ట్రంలోనూ ఇదే తరహా పద్ధతులు అమలు చేసేందుకు బీహార్ ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ప్రజావాణిలో నమోదయ్యే దరఖాస్తుల్లో 68 శాతం పరిష్కారం అవుతున్నాయని, ప్రస్తుతం ఫస్ట్ క్లాస్‌లో ఉన్న పరిష్కార శాతం రానున్న రోజుల్లో డిస్టింక్షన్ స్థాయికి చేరుకుంటుందని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.