30-12-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౯: భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో సోమవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)లో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తాజాగా నిర్ణయంతో మూడు సాయుధ దళాల అమ్ములపొదిలోకి అత్యంత శక్తిమంతమైన అత్యాధునిక సాంకేతిక పరికరాలు, క్షిపణులు సమకూరనున్నాయి. నిఘా వ్యవస్థల పనితనం మరింత మెరుగుపడనుంది.