calender_icon.png 30 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కటైన బాబాయి.. అబ్బాయి

30-12-2025 12:00:00 AM

స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ) కలిసి పోటీ

కూటమిగా ఒక బీఎంసీ, 28 కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటీల్లో బరిలోకి..

ముంబై, డిసెంబర్ 29: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న పవార్ కుటుంబం కలిసిపోయింది. బాబాయి శరద్‌పవార్, అబ్బాయి అజిత్ పవార్ చేతులు కలిపారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రే సోదరులు ఇటీవల చేతులు కలిపిన కొద్దికాలానికే తాజా పరిణామం ఆ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది.

పాత కక్షలు, విభేదాలను పక్కనపెట్టి రాజకీయపరంగా రెండు శక్తిమంతమైన కుటుంబాలు ఎన్నికలోల పొత్తులు పెట్టుకోవడం గమనార్హం. వచ్చే నెల ౧౫ నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరగునున్న వేళ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత అజిత్ పవార్ ఒక్కటవడం రాజకీయాల్లో సంచలన సృష్టించింది. తమ రెండు పార్టీ కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగుతాయని, కొత్త కూటమికి శరద్‌పవార్ నాయకత్వం వహిస్తారని అజిత్ పవార్ తేల్చిచెప్పారు.

సోమవారం పింప్రీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కూటమిగానే బృహన్ ముంబై మునిసపల్ కార్పొరేషన్ (బీఎంసీ)తోపాటు 28 కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటీలు, 336 పంచాయతీ సమితుల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.