calender_icon.png 13 May, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాతృదినోత్సవం

12-05-2025 12:06:42 AM

పటాన్‌చెరు, మే 11 : పటాన్ చెరు పట్టణంలోని ఎం డి ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం మాతృ దినోత్సవాన్ని నిర్వహించారు.  ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ ఆయన తల్లి తులసి లక్ష్మి మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలింతలకు నిత్యవసర వస్తువులతో కూడిన బేబీ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎం డి ఆర్  ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో నిత్య సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి మాతృ దినోత్సవం సందర్భంగా కేక్ కట్  చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరి, కల్పన, జకీర, ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.