27-09-2025 12:48:28 AM
జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మంత్రికుంటలో ఎంపీ రఘునందన్ రావు బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించారు. అనంతరం మాదారంలో నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని పరిశీలించారు. లక్షా 26వేలు విరాళం అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వంగేటి ప్రతప్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, సుధాకర్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.