14-05-2025 12:00:00 AM
భారత రాష్ట్ర సమితి నాయకులు కండె సుధాకర్
భీమదేవరపల్లి మే 13 ( విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘భూభారతి‘ ఆర్ ఓ ఆర్ (2025)చట్టం ద్వారా నిరుపేద, బడుగు బలహీన అణగారిన వర్గాల పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పట్టాలు అందక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ పేద రైతులకు‘భూభారతి‘ద్వారా యాజమాన్య హక్కులు కల్పించి పట్టాలు ఇప్పించి వారిని ఆదుకోవాలని కోరారు.
భూమికోసం,భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి దళిత బహుజనులు బ్రతకడానికి భూమి లేక ప్రభుత్వ భూములను గుట్టలను రాళ్లను రప్పలను చెట్లను చేమలను చదును చేసుకుని వ్యవసాయం కొనసాగిస్తూ ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారన్నారు.. అలాంటి వారికి ఇప్పటికి పట్టాలు అందకపోవడం బాధాకరం...
కాబట్టి తక్షణమే వారందరిని గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్,పోడు భూములు,సీలింగ్ భూముల్లో సాగులో ఉన్నటువంటి ప్రతి రైతుకు న్యాయం జరగాలని కోరారు. గుంట భూమి పట్టా లేని వారు ఇలాంటి భూములు సాగు చేసుకుని సంవత్సరానికి ఒక పంట తీసుకుంటూ , సాగునీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు.కాబట్టి వీరికి పట్టాలు ఇచ్చుకుంటూ సాగునీరు కోసం సబ్సిడీ బాయిలను మంజూరు చేయాలని కోరారు.