30-01-2026 12:22:14 AM
మెదక్ జనవరి 29 (విజయక్రాంతి): ఎన్నికల నియమాల్లో భాగంగా మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు టి రవి కిరణ్ ఐఎఫ్‌ఎస్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు టి రవి కిరణ్ కు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
జిల్లాలో ఎన్నికల తీరును, మున్సిపాలిటీలను, మున్సిపాలిటీలో వార్డుల గురించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సాధారణ పరిశీలకులు రవి కిరణ్ కు వివరించారు. సాధారణ పరిశీలకులు మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల సరళిని పరిశీలించనున్నారు. అనంతరం మెదక్ మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో కలసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఉన్నారు.