30-01-2026 12:20:45 AM
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి
గజ్వేల్, జనవరి 29: అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కెసిఆర్ కి నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో అవమానించాలని చూస్తున్నారని బిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే బిఆర్‌ఎస్ పార్టీ పరువు తీయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసర విచారణలను చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరుసగా ఎన్నికల సమయాల్లోనే కాళేశ్వరం, ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ పేర్లతో ఎపిసోడ్ లలాగా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సమావేశల్లోను అభివృద్ధి బదులు కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు ల పేర్లే సీఎం రేవంత్ రెడ్డి జపిస్తున్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ స్టేట్ హోమ్ సెక్ట్రటరీ భద్రతా చర్యలలో భాగంగా కేంద్ర హోమ్ సెక్ట్రటరీ అనుమతులతో చేస్తారని, కెసిఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న ఆధారాలు ఎక్కడా లేవన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సిట్ విచారణకు అనుమతులు ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పునాదులు కులడానికేనన్నారు. సమస్య ఏదైనా ఎదురుకుంటామని, మున్సిపల్ ఎన్నికలలోను బిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. సమావేశంలో రైతుబంధు రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు ఏంబరి రామచంద్రం, కిషన్ రెడ్డి, మద్దిరాజిరెడ్డి, చెరుకు చంద్రమోహన్ రెడ్డి, ఆయా వార్డుల ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.