calender_icon.png 30 August, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా పనులు పూర్తిచేయాలి

30-08-2025 12:31:12 AM

 - నాణ్యత, ప్రమాణాలు పాటించాలి

- ‘డ్రై’డే ను పకడ్బందీగా నిర్వహించాలి

- హెల్త్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచుకోవాలి

- కలెక్టర్ హైమావతి

సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 29 : అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణాల్లో నాణ్యత, ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ, ఏంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కిం ద చేపడుతున్న పనులపై ఎంపీడీవోలు, ఎం పీవో, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గృహ నిర్మాణ శాఖల అధికారులతో కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 

ఏంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద జిల్లాలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్, సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ శానిటరీ క్యాంప్లెక్స్ కోసం ఆయా మండలాల తహసీలదార్లతో చర్చించి స్థలాన్ని సేకరించుకోవాలని సూచించారు. జిల్లాలో పనుల జాతర కార్యక్రమంలో శంకుస్థాపన చేసిన గ్రామంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్ లను ఏజెన్సీ ఫైనల్ చేసి వెంటనే ప్రారంభించాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత కాలంలోగా పూర్తి చెయ్యాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులను ఆదేశించారు.

ఈజీఎస్ కింద పండ్ల తోటల పెంపకం ఈ సంవత్సర లక్ష్యం 1335 ఎకరాలుగా నిర్దేశించారని, వర్షాకా లం దృష్ట్యా తప్పనిసరిగా లక్ష్యం పూర్తి చెయ్యాలని చెప్పారు. ల్యాండ్ ఐడెంటిఫై, ఫిట్టింగ్ ప్లాంటింగ్ వేగంగా పూర్తి చెయ్యాలని, వివిధ హాస్టల్ గార్డెన్ లో మునగ, కరి వేపాకు, నిమ్మ మొక్కలు పెట్టాలని ఆదేశించారు. వనమహోత్సవ లక్షాన్ని వంద శాతం పూర్తి చేసినందుకు అందరిని అభినందించా రు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మురుగు కాలువలు, కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మించడానికి స్థల సేకరణ చెయ్యాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీ వోలతో మాట్లాడారు. ఇల్లు కట్టుకోడానికి సుముఖంగా లేనివారిని తొలగించి, అర్హులైన లబ్ధిదారునికి అందివ్వాలని ఆదేశించా రు.

ఇంజనీర్ అధికారులు ప్రతి ఇల్లు విజిట్ చెయ్యాలని, ఆయా స్థాయిలో పూర్తి కాగానే ఫొటో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తే పేమెంట్ త్వరగా అందుతుందని తెలిపారు. జిల్లాలో అధిక వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబ లే అవకాశం ఉన్నందున డ్రై డే కార్యక్రమా న్ని గ్రామాల్లో అత్యంత పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూ చించారు. ఇండ్లలో నీరు నిల్వ ఉండకుండా చెత్త సేకరణ చెయ్యాలని ఆదేశించారు.

అలాగే అన్ని పీహెచ్ సీ, సీహెచ్సీ, సబ్ సెంటర్లలో అన్ని వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాలను పూర్తి చెయ్యాలని, ఇంకా పనులు ప్రారంభించని వాటిని నిర్ణీత కాలంలోగా పూర్తి చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రమేష్, డీఆర్డివో జయదేవ్ ఆర్య, డీఎంహెచ్వో ధనరాజ్, బీడబ్ల్యువో లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

508 పంచాయతీల్లో 6,55,958 ఓటర్లురాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 

గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... 2025 జూలై 1 వర కు జిల్లాలోని 508 గ్రామపంచాయతీల్లో 4,508 పోలింగ్ స్టేషన్లలో 6,55,958 ఓటర్లు ఉన్నారని, గ్రామపంచాయతీలలో ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామని తెలిపారు.

వేరువేరు ఇంటి నెంబర్ ఉన్న కుటుంబ సభ్యులను ఒకే వార్డులో చేర్చామని, మృ తుల వివరాలు జాబితాలో డెత్ అని వస్తుందని తెలిపారు. ఓటర్ జాబితాపై ఎలాంటి సందేహాలున్న ఆయా గ్రామపంచాయతీలో లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశం లో జిల్లా గ్రామపంచాయతీ అధికారి దేవకీదేవి పాల్గొన్నారు.