30-08-2025 12:31:34 AM
తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమా వేశాల్లో ఎస్సీలలోని 58 ఉప కులాలకు అన్యాయం చేసే రోస్టర్ విధానం వల్ల జరుగుతున్న నష్టాన్ని వెంటనే సవరించి, 40 లక్షల మంది మాలలకు అన్యాయం చేసే ప్ర వేశపెట్టిన 99 జీవోను వెంటనే రద్దు చేసి, ఎస్సీలోని గ్రూప్-3 కి రోస్టర్ 22 ను వెంటనే మార్చాలని తెలంగాణ రాష్ట్రం మాల సం ఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవాధ్యక్షులు చెరుకు రామచందర్, ఉపాధ్యక్షులు పి.వి.వీరస్వామి, వర్కింగ్ చైర్మన్ మంత్రి నర్సింహ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న)లు మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా మేదావులతో కానీ, న్యాయ నిపుణులతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఐదు నెలల క్రితం షమీం అక్తర్ రిపోర్టు ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ శాస్త్రీయంగా జరగలేదని, 58 కులా లకు రిజర్వేషన్లను దూరం చేసిందన్నారు.
ఇది ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పిదం అన్నారు. దీని ద్వారా గ్రూప్-3లో ఉన్న 26 కులాలు, గ్రూప్-1 లో ఉన్న15 కులాలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 లో ఉన్న 26 కులా లు, ఐదవ తరగతి నుండి పీహెచ్ డీ వరకు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ మెంట్లలో, ఉపా ధి అవకాశాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉందన్నారు.
ఈ విషయంలో మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకురా కపోతే నియోజకవర్గాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. జేఏసీ రాష్ట్ర నాయకులు డా.బి.వీర స్వామి, మాదాసు రాహుల్ రావు, నామా సైదులు, కొప్పుల అర్జున్, షేక్ పేట సత్యనారాయణ, బిఎస్‌ఎన్‌ఎల్ బాలకృష్ణ, గోపి సత్యనారాయణ, గంగాధర్, కనివేట నర్సింగ్ రావు, డబ్బా రాములు పాల్గొన్నారు.